![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -292 లో.....ప్రీతీ శ్రీమంతానికి సుధా పిన్నిని పిలవడానికి వెళదాం బావ అని రుద్రతో వీరు అనగానే నేను రానని రుద్ర చెప్తాడు. ఎందుకని వీరు అనగానే ఇప్పుడు మనం వెళ్లి పిలిస్తే అత్తయ్య వస్తుంది కానీ మావయ్య విశ్వనాథ్ గారు ఏం అంటారు. శ్రీమంతం చేస్తున్న వాళ్ళు చెప్పడానికి కూడా రాలేదంటే నువ్వంటే అంత ఇష్టం లేదా అని మావయ్య అంటాడు. అది బాగోదు అందుకే పెద్దమ్మ, పెద్దనాన్న వెళ్లి పిలవాలని రుద్ర అంటాడు. అవును శకుంతల అని పెద్దసారు అంటాడు. నేను వెళ్ళనని శకుంతల చెప్పి లోపలికి వెళ్తుంది.
పెద్దమ్మని ఒప్పించే బాధ్యత నీదే అని వీరుతో రుద్ర చెప్తాడు. దాంతో శకుంతల దగ్గరికి వీరు వెళ్లి అత్తయ్య ఒప్పుకోండి.. ఆ వీరు కావాలనే మిమ్మల్ని ఇరికించాడు.. ఇప్పుడు ప్రీతి దృష్టిలో బ్యాడ్ అవ్వకండి.. వాళ్ళు వచ్చాక మనం చేసేది మనం చేద్దామని వీరు అనగానే శకుంతల ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అత్తయ్య ఒప్పుకుందని వీరు చెప్తాడు. ఆ తర్వాత రుద్ర టీవీలో ఫుట్ బాల్ పోటీ గురించి వింటాడు. అప్పుడే అతడికి భాను గుర్తు వస్తాడు. తనకి ఫుడ్ బాల్ అంటే చాలా ఇష్టమని చెప్పిన విషయం గుర్తుచేసుకుంటాడు. అప్పుడే పెద్దసారు వస్తాడు. భానుకి ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టమని చెప్తాడు. తన కోసం ఏదైనా చెయ్యాలని రుద్ర అంటాడు.
పిల్లలకు ఉచితంగా నేర్పించాలని రుద్ర అనగానే కోచ్ లు ఎంతమంది కావాలో, దానికి ఏం కావాలో చెప్పు చేద్దాం.. నువ్వు ఏం అడిగితే అది చేస్తాను.. అన్ని ఏర్పాట్లు నువ్వు దగ్గరుండి చూసుకోమని పెద్దసారు చెప్తాడు. ఆ తర్వాత శకుంతల, పెద్దసారు, ఇషిక వీరు అందరు కలిసి సుధాని పిలవడానికి వస్తారు. వాళ్లని చూసి సుధా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఎందుకు బ్రో అత్తయ్య వచ్చేలా చేసావని వీరుని ఇషిక అడుగుతుంది. ఇప్పుడు ఆ విశ్వనాథ్ ఇంట్లో లేడని వచ్చారు. ఇప్పుడు అతన్ని రప్పిస్తే ఇంట్లో పెద్దగొడవ జరుగుతుందని ఇషికతో వీరు అంటాడు. అనుకున్నట్లుగానే విశ్వకి ఫోన్ చేస్తాడు వీరు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |